పోల్చబడిన ఆదాయము
(క్రింది అంకెలు మిలియను రూపయలలో ఉన్నవి)
సర్వీసు | 2006-07 | 2007-08 | 2008-09 | 2009-10 |
|---|---|---|---|---|
పాసింజర్ సర్వీసు (ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్ / పాసింజర్ బండ్లు) | 535.3 | 590.3 | 602.0 | 598.0 |
ఇతర కోచింగు | 54.0 | 61.5 | 64.1 | 65.0 |
సరకు రవాణా | 1981.6 | 2049.1 | 1680.4 | 2380.0 |
ఇతరత్రా | 16.3 | 25.5 | 25.6 | 26.0 |
మొత్తము | 2587.2 | 2728.6 | 2372.1 | 3060.0 |
ప్రయాణీకులు | 17.9 | 20.5 | 21.3 | 22.0 |
సరకుల పరిమాణము (Million tonnes) | 2.6 | 2.8 | 2.2 | 2.5 |
ఏర్పడిన క్రొత్తలో గుంటూరు డివిజన్ కు సరకు రవాణా వలన దాదాపు 930 మిలియన్ రూపాయల ఆదాయం మత్రమే వచ్చుచుండెను. కాని స్థిరముగ ఆదాయము పెరుగటంతో 2007-08 లోగా దాదాపు 2.72 బిలియన్ రూపాయల వరకు ఆదాయము పెరిగినది. 2008-09లో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన వాణిజ్య మాంద్యము వల్ల ఆదాయము 2.32 బిలియన్ రూపాయలకు తగ్గినది. అప్పటినుండి, పాసింజర్ / ఎక్స్‌ప్రెస్ (వేగ బండ్లు మరియు అతివేగ బండ్లు) వలన వచ్చిన ఆదాయము ఉపాంతరంగా పెరిగినది.
2008-09లో ఈ డివిజన్ యొక్క వ్యయము దాదాపు 1.35 బిలియన్ రూపయల వరకు, ప్రధానంగా ప్రయాణీకుల వసతులు మరియు రైలు పట్టాల ఆధునీకరణ పనుల వలనే కలిగినది. ఇందువలన, డివిజన్ యొక్క నిర్వహణ సామర్ధ్యత ఇండెక్సు 57.04 శాతముగ నమోదు చేయబడినది.2007-08లో, డివిజన్ యొక్క వ్యయము 0.89 బిలియన్ రూపాయలుగాను, నిర్వహణ సామర్ధ్యత ఇండెక్సు 32.92 శాతముగాను నమోదు చేయబడియున్నవి.
ఏప్రిల్ 2009లో జరిగిన దక్షిణ మధ్య రైల్వే యొక్క 54వ రైల్వే వారపు సంబరాలలో, గుంటూరు డివిజన్ సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ ఎక్సలెన్సు డాలును గెలుచుకున్నది.
ఈ డివిజన్ వలన ప్రధానముగా సిమెంటు రవాణా చేయబడుచున్నది. అంతేగాక, ధాన్యాలు, పత్తులు/దూది, మిరపలు, కలప వ్యర్ధాలు కూడా రవాణా చెయబడుచున్నవి. సరకులను ఎగుమతి చేయు ప్రధాన కేంద్రాలు:-
- ఎం/ఎస్ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ : విష్ణుపురం.
- ఎం/ఎస్ పెన్నా సిమెంట్స్ లిమిటెడ్ : విష్ణుపురం మరియు మిర్యాలగూడ.
- బియ్యము : మిర్యాలగూడ మరియు నల్గొండ.
- ధాన్యాలు, దూది ఉముకలు, మిరపలు : రెడ్డిపాలెం
- కలప వ్యర్ధాలు : మార్కాపూర్ రోడ్డు మరియు కంబం.