గుంటూరు డివిజన్ మీకు స్వాగతం పలుకుతున్నది

పర్యటక స్ధలాలు


గుంటూరు డివిజన్లోని పర్యటక స్ధలాలు

  • మంగళగిరి : మంగళగిరి విజయవాడ - గుంటూరు రైలు మార్గముపై ఉన్నది. ఇందు ప్రాచీన కాలపు ఆలయము వెలసినది. మంగళగిరి చేతిమగ్గమునకు పేర్కొనబడినది.
  • నాగార్జున సాగర్ : మాచెర్ల స్టేషను నుండి 29 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ ఉన్నది. కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్టచే ఏర్పడిన జలాశయమిది. బుద్ధుడి కాలములో వెలసిన కృష్ణలోయ నాగరికత, ఈ ప్రాంతంలోనె వెలసినత్లుగా ఆధారాలు లభించినవి.  2000 సంవత్సరాల ప్రాత స్తూపము మరియు విశ్వవిద్యాలయపు అవశిష్టాలు నేటికి నిమజ్జితమై ఉన్నవి. సేకరింపబడిన అవశిష్టాలను నాగార్జున కొండలోని(ఇది నాగార్జున చెరువులో ఒక ద్వీపము) మ్యూజియంలో ప్రదర్శింపబడినవి. ఇచ్చటకు సమీపములోనే ఎత్తిపోతల జలపాతమున్నది. ఈ జలపాతము భారత దేశములోనే అతి పెద్ద జలపాతాలలో ఒకటి. 
మంగళగిరి స్టేషన్
  • శ్రీశైలం : ఇది మార్కాపూర్ రోడ్డు స్టేషన్ నుండి దాదాపు 85 కిలోమీటర్ల దూరంలోను, వినుకొండ స్టేషన్ నుండి దాదపు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇందు కూడ క్రిష్ణా నదిపై విద్యుతుత్పత్తి ప్రాజెక్ట్ నిర్మింపబడినది. ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. సమీపములో రాజీవ్ గాంధి నేషనల్ పార్కు ఉన్నది. ఇది బంగాళ పులులకు ప్రసిద్ధము. 
  • అమరావతి : శాతవాహన సామ్రాజ్యపు రాజధానిగా వర్ధిల్లిన అమరావతి నగరము, గుంటూరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది అమరేశ్వరుని ఆలయమునకు ప్రసిద్ధమైనది. ఒక ప్రసిద్ధమైన శైవ క్షేత్రమేగాక, ఇచ్చట అశోక చక్రవర్తి నాటి స్తూపము కూడా ఉన్నది.  
  • మహానంది : నంద్యాల నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మహానంది. మహానందిలో మహానందీశ్వర స్వామివారి ఆలయమున్నది. ఇది నవనందులలో ఒకటి. ఈ ఆలయమున, గర్భగృహంలోని శివలింగమును చేతులతో తాకి దేవుడిని కొలిచెదరు భక్తులు. 
  • మాచెర్ల : ఇది గుంటూరు నుండి 131 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నాగార్జున సాగర్‌కు సమీపములోని రైల్వే స్టేషన్ ఇది. ఇచ్చట 13 వ శతాబ్దం నాటి శ్రీ లక్ష్మి చన్నకేశవస్వామి వారి ఆలయమున్నది.
  • ఉప్పలపాటి పక్షి సంరక్షణ కేంద్రము : ఇది గుంటూరు నుండి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. విదేశాల నుండి ఎన్నో విధాల పక్షులు ఇక్కడికి వలస వచ్చెదవు. చుక్కల గూడకొంగలు ఇచ్చటుకు ఎక్కువగా వలస వచ్చెదవు.  
ఉప్పలపాటి పక్షి సంరక్షణ కేంద్రములో గూడకొంగలు.
  • కంబం చెరువు : ఇది ప్రపంచంలోనే 3 వ అతిపెద్ద చెరువు. ఆసియా ఖండంలో 2వది. ఈ చెరువు ఓఢ్రదేశపు గజపతులచే నిర్మింపబడినది. చాల ప్రాచీన చెరువిది. గుండ్లకమ్మ నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వలన ఏర్పడిన చెరువిది. 20వ శతాబ్దంలో ఈ ఆనకట్ట దాదాపు 57 అడుగుల (17 మీటర్లు) ఎత్తు ఉండెనట. ఇది దాదాపు 10,300 ఎకరాల పొలభూమికి నీరందించుచున్నది. ఇది కంబం రైల్వే స్టేషన్‌కు దగ్గరిలోనే ఉన్నది. 
  • భట్టిప్రోలు : తెనాలి నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న భట్టిప్రోలు, గుంటూరు - రేపల్లె రైలు మార్గముపై ఉన్నది. ఇది ప్రాచీన కాలపు బౌద్ధ క్షేత్రము. ఈ క్షేత్రములో లభించిన ప్రాచీన కాలపు శాసనాలు, ఈ క్షేత్రపు ప్రాచీనతకు ఆధారాలు. ఈ క్షేత్రములోనే తెలుగు మరియు తమిళ లిపులు రూపందుకున్నట్టు లభించిన ఆధారాలు సూచించుచున్నవి.