దక్షిణ మధ్య రైల్వే యొక్క 6 డివిజన్లలో గుంటూరు డివిజన్ ఒకటి. ఈ డివిజన్ యొక్క హెడ్క్వాటర్సు (ప్రధాన కార్యాలయము) రైల్ వికాస్ భవన్, పట్టాభిపురం, గుంటూరులో ఉన్నది. పూర్వము ఇచ్చట మీటర్ గేజి మార్గము నడిచుచుండెను. (కో-ఆర్డినేట్లు - 16-18`,04.11``ఉ, 80-26`,36.37``తూ, ఎత్తు - 123 అడుగులు)
గుంటూరు అను పదము పూర్వపు గుంట లేక గర్త (అనగా చెరువు) నుంచి ఏర్పడినది. ఈ ప్రాంతములో ఎక్కువ చెరువులు, గుంటలు, జలాశయాలు, మరియు ఏళ్లు ఉండుటచే, ఈ ప్రాంతము ఇటుల పేర్కొనబడియుండవచ్చును. పూర్వము దీనికి గర్తపురి అని మరొక పేరు ఉండెను. 18వ శతాబ్దంలో ఫ్రెంచి దేశపు వారు ఈ ప్రంతమునకు వచ్చి చేరారు. అప్పుడు ఈ ప్రాంతమున పెక్కు నదులు, ఏళ్లు, చెరువులు, జలాశయాలు ఉండేవట. కాని త్రవక్క పనులు ఎక్కువగా జరుగుటచే ఇవి కనుమరుగయ్యాయి.
గుంటురు డివిజన్ యొక్క రైల్వే పటము (లేత ఎరుపు రంగులోని గీత)
గుంటూరు డివింజన్ ఇటీవల ఏర్పడిన ఓ క్రొత్త డివిజన్. గుంటూరు డివిజన్ యొక్క ఏర్పాటు గురించి రైల్వే బోర్డు నుంచి 1997లోనే వార్త వెలువడినది. కానీ, ఏప్రిల్ 1 2003లోనే గుంటూరు డివిజన్ అధికారములోకు వచ్చినది. ఈ డివిజన్ను ఏర్పరుచుటకు ముఖ్యకారనము, వెనుకబడిన తెలంగాణ ప్రాంతాలను అభివృధ్ధి పరుచి, సహకరించుటకే. ఈ డివిజన్లో, తెనాలి - గుంటూరు [సింగిల్ లైన్], గుంటూరు - కృష్ణాకెనాల్ జంక్షన్ [డబుల్ లైన్] మరియు న్యూ గుంటూరు కేబిన్ - న్యూ గుంటూరు - మణిపురం [సింగిల్ లైన్] మార్గాలు మాత్రమే విద్యుదీకరింపబడినవి. ఇక ఇతర మార్గాలన్నిటికీ విద్యుదీకరణ లేదు. ఈ డివిజన్లో పాసింజరు మరియు ఎక్స్ప్రెస్ (వేగ మరియు అతివేగ బండ్లు) బండ్లు ఎక్కువగా నడుచును. కాని, సరకు బండ్ల వలన కూడా మిక్కిలి లాభము లభించినది. 2003లో సరకు రవాణా వలన దాదాపు 930 కోట్ల ఆదాయము వచ్చినది. ఆ తరువత 2000 కోట్ల వరకు ఆదాయము పెరిగినది. సరకు రవాణాలో, ఈ డివిజన్చే సిమెంటు ఎక్కువగా రవాణా చేయబడుచున్నది. అంతేగాక, ధాన్యాలు, పత్తులు/దూది, మిరపలు, కలపలు కూడా రవాణా చేయబడుచున్నవి.
గుంటూరు నుండి నంద్యాల వరకటి మార్గమైతే, శౄంగారవంతముగాను మిక్కిలి అందముగాను, నల్లమల అడవి ప్రాంతము గుండా నడుచుచున్నది. ఇందు రెండు పెద్ద రైలు సొరంగములున్నవి. అవి బొగద రైలు సొరంగము (1.6 కిలోమీటర్ల పొదవు) మరియు చల రైలు సొరంగము (700 మీటర్ల పొడవు). బొగద రైలు సొరంగము భారతదేశములోనే అతిపొడవైన బ్రాడ్ గేజి రైలు సొరంగాలలో ఒకటిగా పేర్కొనబడినది. గుంటూరు నగరము నుండి ఇది దాదాపు 230 కిలోమీటర్ల దూరములో ఉన్నది.
గుంటూరు నుండి నంద్యాల వరకటి మార్గమైతే, శౄంగారవంతముగాను మిక్కిలి అందముగాను, నల్లమల అడవి ప్రాంతము గుండా నడుచుచున్నది. ఇందు రెండు పెద్ద రైలు సొరంగములున్నవి. అవి బొగద రైలు సొరంగము (1.6 కిలోమీటర్ల పొదవు) మరియు చల రైలు సొరంగము (700 మీటర్ల పొడవు). బొగద రైలు సొరంగము భారతదేశములోనే అతిపొడవైన బ్రాడ్ గేజి రైలు సొరంగాలలో ఒకటిగా పేర్కొనబడినది. గుంటూరు నగరము నుండి ఇది దాదాపు 230 కిలోమీటర్ల దూరములో ఉన్నది.
ఏర్పడిన నాటి నుండి, గుంటూరు డివిజన్ యొక్క ఆదాయము ప్రతి సంవత్సరము సరకు రవాణా వలన పెరుగుచూనె ఉన్నది. 2006-07లో సరకు రవాణా వలన మాత్రమే లభించిన ఆదాయము దాదాపు 98 కోట్లు. అప్పుదు మొత్తం ఆదాయము 258 కోట్లు.
గుంటూరు డివిజన్ చరిత్ర -
గుంటూరు నుండి మాచెర్ల వరకు మరియు గుంటూరు నుండి నంద్యాల వరకు ఉమ్మడి మద్రాసు మరియు దక్షిణ మహరట్టా రైల్వే మరియు బ్రిటిషు ప్రభుత్వము వలన 19వ శతాబ్దములో, మీటర్ గేజి మార్గాలు నిర్మింపబడినవి.
చెన్నై పట్టణమునకు సరైన రైలు మార్గము లేకపోయే సారికి, అప్పట్లో మద్రాసు రాష్ట్రమునకు చెందిన గుంటూరు నుండి క్రొత్త మార్గాలు నిర్మింపబడినవి. సరకుల రవాణా కొఱకే ఈ మార్గాలు నిర్మింపబడినవి.
ఈ మార్గాలు 1990 నుండి 1994 లోపల బ్రాడ్ గేజి మార్గాలుగా మార్చబడినవి.
గుంటూరు నుండి నంద్యాల మీదుగా గుంతకల్లు వరకు నిర్మింపబడిన మార్గము గోవ మరియు మచిలీపట్నాల మధ్య సరకులు రవాణా చేయటానికి మిగుల ఉపయోగపడినది. ఇందువలన గుంటూరు ప్రధానమైన వాణిజ్య కేంద్రముగా మారినది.
ఎం.ఎస్.ఎం.ఆర్ చేత నిర్మింపబడిన వేజెండ్ల - చుండూరు 10 కిలోమీటర్ల రైలు మార్గము ఇప్పుడు వాడుకలో లేదు. ఈ మార్గము తెనాలిని తాకకుండా తిన్నగా చుండూరు చేరేది. దీనివలన, గుంటూరు నుండి చెన్నై వరకటి దూరము దాదాపు 16 కిలోమీటర్ల వరకు తగ్గేది.
