గుంటూరు డివిజన్ మీకు స్వాగతం పలుకుతున్నది
న్యూగుంటూరు రైల్వే స్టేషను


గుంటూరు డివిజన్, దక్షిణ మధ్య రైల్వేలోని, 6 డివిజన్లలో ఒకటి. ఈ డివిజన్ యొక్క హెడ్‌క్వార్టర్సు(ముఖ్య కార్యాలయము) 'రైల్ వికాస్ భవన్', పట్టాభిపురం, గుంటూరులో వున్నది. ఈ డివిజన్ మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలను వ్యాపించియున్నది.  


గుంటూరు రైల్వే స్టేషను
దొరబావి వంతెన

ఏప్రిల్ 2009లో జరిగిన, దక్షిణ మధ్య రైల్వే 54వ రైల్వే వారంలో, గుంటూరు డివిజన్ సిగ్నల్ మరియు టెలికాం విభాగంలో, ఉత్తమపురస్కార డాలు గెలుచుకుంది.

ఈ డివిజన్‌వల్ల రవాణా చేయబడు సరకుల్లో, సిమెంటు ఎక్కువగా రవాణా చేయబడుతుంది. అంతేగాక, ధాన్యాలు, పత్తి/దూది, మిరపలు మరియు కలప వ్యర్ధాలు కూడా రవాణా చేయబడుతున్నాయి.